Team India: 40 ఏళ్లుగా సేవలందిస్తున్న ఢిల్లీ స్టేడియం డ్రెస్సింగ్ రూం సహాయకుడికి జెర్సీ బహూకరించిన టీమిండియా

Team India presents signed jersey to Delhi stadium dressing room attendant
  • నిన్న ఢిల్లీలో టీమిండియా, ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్
  • ఆఫ్ఘనిస్థాన్ పై టీమిండియా భారీ విజయం
  • డ్రెస్సింగ్ రూం అసిస్టెంట్ ను సత్కరించిన టీమిండియా 
  • ఆటగాళ్లు సంతకం చేసిన జెర్సీ అందించిన రోహిత్, కోహ్లీ
నిన్న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత జట్టు ఆఫ్ఘనిస్థాన్ తో వరల్డ్ కప్ మ్యాచ్ ఆడింది. ఈ పోరులో భారత్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం అందుకుంది. మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూంలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. 

గత 40 ఏళ్లుగా ఢిల్లీ స్టేడియం డ్రెస్సింగ్ రూం అటెండెంట్ (సహాయకుడు)గా సేవలు అందిస్తున్న వినోద్ కుమార్ ను టీమిండియా సత్కరించింది. టీమిండియా ఆటగాళ్లు సంతకాలు చేసిన ఓ ఫుల్ స్లీవ్ జెర్సీని కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ... వినోద కుమార్ కు బహూకరించారు. వినోద్ కుమార్ సేవలను కొనియాడారు. ఆటగాళ్లంతా చప్పట్లు కొడుతూ వినోద్ కుమార్ ను అభినందించారు.

టీమిండియా ఆటగాళ్ల నుంచి ఊహించని ఈ గౌరవాభిమానాలకు వినోద్ కుమార్ ముగ్ధుడయ్యారు. ఆటగాళ్లు ప్రదానం చేసిన జెర్సీని అందుకుని వారితో ఆత్మీయ కరచాలనం చేసి ఎంతో సంతోషంతో డ్రెస్సింగ్ రూంను వీడారు.
Team India
Vinod Kumar
Attendant
Dressing Room
Delhi Stadium

More Telugu News