వైసీపీ క్యాడర్ కు సీఎం జగన్ ఇచ్చిన సందేశం ఇదే: విజయసాయిరెడ్డి
- ఇటీవల పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించిన జగన్
- ప్రజల్లోకి వెళ్లి.. ప్రభుత్వం చేపట్టిన పనులను వివరించాలని జగన్ చెప్పారన్న విజయసాయి
- ప్రజల కోసం ఉన్న పార్టీ వైసీపీ అని వ్యాఖ్య
ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా స్పందిస్తూ... పార్టీ కేడర్ కు జగన్ స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారని తెలిపారు. ప్రజల్లోకి వెళ్లాలని, ఏపీ ప్రయోజనాల కోసం ప్రజల్లో భరోసా కల్పిస్తూ వైసీపీ ప్రభుత్వం చేపట్టిన పనులను వారికి వివరించాలని జగన్ చెప్పారని తెలిపారు. ప్రజల కోసం ఉన్న పార్టీ వైసీపీ అని చెప్పారు. వైనాట్ 175 అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేశారు.