Israel-Hamas War: హమాస్‌ను ఈ భూమ్మీద లేకుండా పూర్తిగా తుడిచిపెట్టేస్తాం.. నెతన్యాహు వార్నింగ్

Israel PM Benjamin Netanyahu Warns To Wipe Hamas
  • పాలస్తానా మిలిటెంట్ సంస్థకు తీవ్ర హెచ్చరికలు
  • హమాస్‌లోని ఒక్కరిని కూడా వదిలిపెట్టబోమని వార్నింగ్
  • వార్ క్యాబినెట్ మీట్‌లో ప్రకటించిన ఇజ్రాయెల్ ప్రధాని
ఊహించని దాడులతో ఇజ్రాయెల్‌ను ఉక్కిరిబిక్కిరి చేసిన హమాస్‌కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ అయిన హమాస్‌లో ఒక్కరిని కూడా విడిచిపెట్టబోమని, ఈ భూమ్మీద నుంచి హమాస్‌ను పూర్తిగా తొలగిస్తామని తేల్చి చెప్పారు. హమాస్‌ను పూర్తిగా అంతమొందిస్తామని నెతన్యాహు స్పష్టంగా చెప్పడం ఇదే తొలిసారి. 

‘‘ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ అయిన హమాస్‌ను పూర్తిగా అణచివేస్తాం. ఈ ప్రపంచం నుంచి వారిని పూర్తిగా నిర్మూలిస్తాం’’ అని తాజాగా ఏర్పాటు చేసిన వార్ క్యాబినెట్‌తో కలిసి ప్రకటించారు. రక్షణ మంత్రి యావ్ గాలంట్ కూడా ఇలాంటి ప్రకటనే చేశారు. భూమిపై హమాస్ అనేదే లేకుండా తుడిచిపెట్టేస్తామని పేర్కొన్నారు.  

కాగా, ప్రస్తుత ఆపత్కాల సమయంలో మాజీ రక్షణ మంత్రి బెన్నీ గాంట్జ్‌తో ఉన్న రాజకీయ విభేదాలను తాత్కాలికంగా పక్కన పెట్టిన నెతన్యాహు అత్యవసర ప్రభుత్వాన్ని (వార్ క్యాబినెట్) ఏర్పాటు చేశారు.
Israel-Hamas War
Daesh
Hamas Militants
Benjamin Netanyahu

More Telugu News