Hamas: ఈ ప్రపంచం మొత్తం తమ చట్టం కిందే ఉంటుందన్న హమాస్ కమాండర్.. ఘాటుగా స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని

Entire Planet Will Be Under Our Law says Hamas Commander Mahmoud Al Zahar
  • ప్రపంచంపై గుత్తాధిపత్యమే తమ లక్ష్యం అన్న హమాస్ కమాండర్ అల్ జహార్
  • తొలి టార్గెట్ ఇజ్రాయెల్ అని వ్యాఖ్య
  • హమాస్ ను కూకటి వేళ్లతో పెకిలిస్తామన్న నెతన్యాహూ
ఓవైపు ఇజ్రాయెల్ - పాలస్తీనా (గాజా స్ట్రిప్) మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. మరోవైపు గాజా మిలిటెంట్ గ్రూప్ హమాస్ కమాండర్ మహ్మౌద్ అల్ జహార్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రపంచంపై గుత్తాధిపత్యాన్ని సాధించడమే హమాస్ లక్ష్యం అని ఆయన చెప్పారు. హమాస్ లక్ష్యాల గురించి ఆయన వెల్లడిస్తున్న ఒక వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. తమ తొలి టార్గెట్ ఇజ్రాయెల్ అని... ఆ తర్వాత యావత్ ప్రపంచం మీద దృష్టి సారిస్తామని చెప్పారు. ఈ భూభాగం మొత్తం తమ చట్టం కిందే ఉంటుందని అన్నారు. 

510 మిలియన్ చదరపు కిలోమీటర్ల భూమి మొత్తం మన వ్యవస్థ కిందకు వస్తుందని... ఆ వ్యవస్థలో పాలస్తీనీయులతో పాటు లెబనాన్, సిరియా, ఇరాక్ ఇతర దేశాల్లోని అరబ్బులపై జరగుతున్న అన్యాయం, అణచివేత, హత్యలు వంటివి ఉండవని అల్ జహార్ చెప్పారు.  

ఈ వీడియో వైరల్ అయిన వెంటనే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఘాటుగా స్పందించారు. హమాస్ ను కూకటి వేళ్లతో పెకిలిస్తామని ఆయన అన్నారు. పాలస్తీనియన్ గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరూ చచ్చినవారేనని వ్యాఖ్యానించారు. 

Hamas
Commander
Palestine
Israel
Benjamin Netanyahu

More Telugu News