రకుల్ ప్రీత్ సింగ్ కు స్పెషల్ విషెస్ చెప్పిన ఆమె ప్రియుడు
- బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీ ప్రేమలో ఉన్న రకుల్
- నిన్న 32వ వసంతంలోకి అడుగుపెట్టిన రకుల్
- ఇద్దరూ కలిసి ఉన్న వీడియోను షేర్ చేసిన జాకీ
ఇంకోవైపు రకుల్ నిన్న 32వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా తన ప్రియురాలికి జాకీ ప్రత్యేకంగా విషెస్ తెలియజేశాడు. ఇద్దరూ కలిసి ఉన్న ఒక వీడియోను రిలీజ్ చేసి రకుల్ కు సర్ ప్రైజ్ ఇచ్చాడు. తనను ఎప్పుడూ ఆశ్చర్యానికి గురి చేసే వ్యక్తి పట్ల తనకున్న అభిమానాన్ని, ప్రేమను తెలియజేయాలనుకుంటున్నానని ఇన్స్టాలో రాసుకొచ్చాడు. నీతో ఉంటే ప్రతి రోజూ ఒక అద్భుతమైన ప్రయాణంలా ఉంటుందని చెప్పాడు. ప్రతి అడుగులో నువ్వే నా భాగస్వామి అని తెలిపాడు. తన జీవితంలో ప్రేమ, సంతోషాన్ని నింపే వ్యక్తివి నీవే అని చెప్పాడు. నీ కలలన్నీ నిజమవ్వాలని ఈ ప్రత్యేకమైన రోజున కోరుకుంటున్నానని తెలిపాడు. ప్రతి రోజును ప్రత్యేకంగా మార్చే వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పాడు.