Naatu Naatu: ఉప్పల్ స్టేడియంలో 'నాటు నాటు' పాటకు కళ్లు చెదిరే లైటింగ్ డిస్ ప్లే... వీడియో ఇదిగో!

Uppal stadium enlighten with Naatu Naatu song lighting display
  • వరల్డ్ కప్ లోనే పాకిస్థాన్, శ్రీలంక ఢీ
  • హైదరాబాదులో మ్యాచ్
  • మ్యాచ్ మధ్యలో 'ఆర్ఆర్ఆర్' పాటతో మార్మోగిన స్టేడియం
  • 'నాటు నాటు' పాటను ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు
హైదరాబాదులోని ఉప్పల్ రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో పాకిస్థాన్, శ్రీలంక జట్ల మధ్య నేడు వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్ మధ్యలో విరామ సమయంలో స్టేడియంలో 'ఆర్ఆర్ఆర్' చిత్రంలోని ఆస్కార్ విన్నింగ్ 'నాటు నాటు' పాట వినిపించారు. ఈ సందర్భంగా స్టేడియంలోని లైట్లతో నిర్వహించిన ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ మ్యాచ్ కు 20 వేల మంది వరకు ప్రేక్షకులు హాజరు కాగా, వారు కూడా 'నాటు నాటు' పాట లైటింగ్ డిస్ ప్లేతో కాలు కదిపారు. దాంతో స్టేడియంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.
Naatu Naatu
RRR
Uppal Stadium
Hyderabad
Pakistan
Sri Lanka
World Cup

More Telugu News