Chandrababu: రాజమండ్రి జైలులో డీహైడ్రేషన్ తో బాధపడుతున్న చంద్రబాబు

Chandrababu has been suffering with dehydration in Rajahmundry central jail
  • జైలులో తీవ్ర ఉక్కపోత
  • డీహైడ్రేషన్ కు గురైన చంద్రబాబు
  • జైలు వైద్యాధికారికి ఫిర్యాదు
  • ఇదే విషయాన్ని ములాఖత్ లో కుటుంబ సభ్యులకు తెలిపిన టీడీపీ అధినేత
స్కిల్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు అస్వస్థతకు లోనయ్యారు. జైలులో తీవ్ర ఉక్కపోత కారణంగా ఆయన డీహైడ్రేషన్ కు గురయ్యారు. దీనిపై చంద్రబాబు జైలు మెడికల్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేశారు. ఇదే విషయాన్ని చంద్రబాబు ములాఖత్ సమయంలో కుటుంబ సభ్యులకు కూడా తెలియజేశారు. ఏపీలో గత కొన్ని రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాజమండ్రి పరిసరాల్లోనూ గత నాలుగు రోజులుగా 38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో విపరీతమైన ఉక్కపోత నెలకొంది.
Chandrababu
Dehydration
Central Jail
Rajahmundry
TDP
Andhra Pradesh

More Telugu News