Ambati Rambabu: తండ్రిని అరెస్ట్ చేస్తే భార్యాపిల్లల్ని వదిలేసి పారిపోయిన బడుద్దాయి: అంబటి రాంబాబు

Ambati Rambabu fires at Nara Lokesh
  • ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ విచారణకు హాజరైన లోకేశ్
  • సీఐడీ విచారణపై విమర్శలు గుప్పించిన నారా లోకేశ్
  • ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చిన అంబటి రాంబాబు
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు ఈ రోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారించారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో నిన్న ఢిల్లీ నుంచి విజయవాడకు వచ్చిన లోకేశ్, ఈ రోజు విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం అధికారుల ప్రశ్నలపై నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు టీడీపీ యువనేతపై సామాజిక అనుసంధాన ఎక్స్ వేదికగా చురకలు అంటించారు. తండ్రిని అరెస్ట్ చేస్తే భార్యాపిల్లలను వదిలి ఢిల్లీ పారిపోయిన బడుద్దాయి అంటూ ఘాటుగా విమర్శించారు.
Ambati Rambabu
Nara Lokesh
Amaravati

More Telugu News