KTR: అమిత్ షా తనయుడు క్రికెట్ ఎప్పుడు ఆడారో చెప్పాలి: కేటీఆర్

KTR questions amit shah on his son
  • అదిలాబాద్ సభలో అమిత్ షా అన్నీ అబద్ధాలే చెప్పారన్న కేటీఆర్
  • బీజేపీకి మరోసారి 110 స్థానాల్లో డిపాజిట్ గల్లంతు కావడం ఖాయమని వ్యాఖ్య
  • పరివార్ వాద్ అంటూ అమిత్ షా మాట్లాడితే ప్రజలు వెక్కిరిస్తున్నారన్న మంత్రి
అదిలాబాద్ సభలో బీజేపీ అగ్రనేత అమిత్ షా అన్నీ అబద్ధాలే చెప్పారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అబద్ధాల అమిత్ షా పార్టీకి తెలంగాణలో గుణపాఠం తప్పదన్నారు. ఆయన తన ప్రసంగంలో నిజాలేమీ చెప్పలేదన్నారు. అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు వారిని తిరస్కరించక తప్పదన్నారు. బీజేపీకి మరోసారి 110 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమన్నారు.

పరివార్ వాద్ అంటూ అమిత్ షా మాట్లాడితే ప్రజలు వెక్కిరిస్తున్నారన్నారు. బీసీసీఐ పదవిలో ఉన్న అమిత్ షా తనయుడు క్రికెట్ ఎప్పుడు ఆడారో దేశ ప్రజలకు చెప్పాలన్నారు. ప్రజాశీర్వాదంతో గెలుస్తున్న పార్టీలను, నేతలను ప్రశ్నించే నైతిక హక్కు అమిత్ షాకు లేదన్నారు. పదేళ్లలో తెలంగాణకు ఒక్క విద్యాసంస్థనూ ఇవ్వలేదని కేంద్రంపై విమర్శలు గుప్పించారు.
KTR
Amit Shah
BJP
BRS

More Telugu News