Amartya Sen: అమర్త్యసేన్ మృతి చెందారంటూ వార్తలు, స్పందించిన కూతురు

Nobel Laureate Amartya Sens Family Denies Rumours Of His Death
  • తమ తండ్రి క్షేమంగానే ఉన్నారని చెప్పిన కూతురు నందనా దేబ్ సేన్
  • ఇలాంటి అసత్య ప్రచారాన్ని మానుకోవాలని హితవు
  • నిన్న సాయంత్రం వరకు తన తండ్రి తనతోనే ఉన్నారన్న కూతురు
ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ మృతి చెందారంటూ వచ్చిన వార్తలపై ఆయన కూతురు నందనా దేబ్ సేన్ స్పందించారు. తన తండ్రి క్షేమంగా ఉన్నారని, ఇలాంటి ప్రచారం సరికాదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఇలాంటి ప్రచారాన్ని మానుకోవాలని నేను కోరుతున్నాను. మా తండ్రి బాగానే ఉన్నారు. నిన్న సాయంత్రం వరకు నేను ఆయనతోనే ఉన్నాను. ఆయన ప్రస్తుతం కొత్త పుస్తకంతో బిజీగా ఉన్నారు' అని తెలిపారు.  
Amartya Sen
news

More Telugu News