New Zealand: వరల్డ్ కప్ లో వరుసగా రెండో విజయం నమోదు చేసుకున్న న్యూజిలాండ్

New Zealand thrashes Nederlands by 99 runs
  • నేడు నెదర్లాండ్స్ పై 99 పరుగుల తేడాతో కివీస్ ఘనవిజయం
  • తొలుత 50 ఓవర్లలో 7 వికెట్లకు 322 పరుగులు చేసిన న్యూజిలాండ్
  • 46.3 ఓవర్లలో 223 పరుగులకు నెదర్లాండ్స్ ఆలౌట్
  • మిచెల్ శాంట్నర్ కు 5 వికెట్లు

భారత్ ఆతిథ్యమిస్తున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ జట్టు రెండో విజయం నమోదు చేసుకుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ ను చిత్తు చేసిన న్యూజిలాండ్... ఇవాళ నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ 99 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. 

హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 322 పరుగులు చేసింది. భారీ లక్ష్యఛేదనకు దిగిన నెదర్లాండ్స్ జట్టు 46.3 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌట్ అయింది. 

కివీస్ లెఫ్టార్మ్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ 5 వికెట్లతో డచ్ జట్టు వెన్నువిరిచాడు. వరల్డ్ కప్ చరిత్రలో ఐదు వికెట్లు తీసిన తొలి న్యూజిలాండ్ స్పిన్నర్ గా శాంట్నర్ ఘనత సాధించాడు. మాట్ హెన్రీ 3, రచిన్ రవీంద్ర 1 వికెట్ తీశారు. 

నెదర్లాండ్స్ జట్టులో కోలిన్ అకెర్ మన్ 69 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ 30, సైబ్రాండ్ ఎంగెల్ బ్రెచ్ట్ 29, తేజ నిడమనూరు 21 పరుగులు సాధించారు.

  • Loading...

More Telugu News