Shubman Gill: శుభ్ మాన్ గిల్ ఆరోగ్యంపై బీసీసీఐ అప్ డేట్

BCCI gives update on Team India young opener Shubman Gill
  • భారత్ లో ఐసీసీ వన్డే వరల్డ్ కప్
  • ఇటీవల డెంగీ బారినపడిన శుభ్ మాన్ గిల్
  • నిన్న ఆస్ట్రేలియాతో మ్యాచ్ కు దూరం
  • ఈ నెల 11న ఆఫ్ఘనిస్థాన్ తో జరిగే మ్యాచ్ లోనూ గిల్ ఆడబోవడంలేదన్న బీసీసీఐ

టీమిండియా డాషింగ్ ఓపెనర్ శుభ్ మాన్ గిల్ ఇటీవల డెంగీ బారినపడిన సంగతి తెలిసిందే. దాంతో గిల్ ఆస్ట్రేలియాతో మ్యాచ్ కు దూరమయ్యాడు. తాజాగా, గిల్ ఆరోగ్యంపై బీసీసీఐ అప్ డేట్ ఇచ్చింది. గిల్ ఇంకా కోలుకోలేదని వెల్లడించింది. 

ఇవాళ టీమిండియా ఢిల్లీకి బయల్దేరిందని, అయితే గిల్ జట్టు వెంట వెళ్లబోవడంలేదని బీసీసీఐ కార్యదర్శి జై షా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. టీమిండియా ఈ నెల 11న ఢిల్లీలో ఆఫ్ఘనిస్థాన్ జట్టుతో వరల్డ్ కప్ మ్యాచ్ ఆడనుండగా, ఈ మ్యాచ్ కు కూడా గిల్ అందుబాటులో ఉండడంలేదని వివరించారు. గిల్ చెన్నైలోనే వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స పొందనున్నాడని తెలిపారు.

  • Loading...

More Telugu News