Amitabh Bachchan: అభిమాని కామెంట్ కు అవాక్కయ్యే బదులిచ్చిన అమితాబ్

Amitabh Bachchan takes a hilarious dig at fashion sense of of todays generation
  • పూల రంగుల చొక్కా, ట్రాక్ పాయింట్ తో దర్శనమిచ్చిన అమితాబ్
  • అమితాబ్ ప్యాంట్ తాడులు వేలాడుతున్న వైనం
  • దీన్ని ప్రస్తావించిన అభిమానికి ఊహించని బదులు

బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబచ్చన్ ప్రతి ఆదివారం తన అభిమానులతో గడుపుతుంటారు. సోషల్ మీడియాలోనూ చురుగ్గా వారితో టచ్ లో ఉంటుంటారు. ఇటీవలే అబితాబ్ తన అభిమానులను పలకరిస్తున్న ఫొటో ఒకదాన్ని ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. అందులో అమితాబ్ వస్త్రధారణ చాలా భిన్నంగా ఉండడాన్ని చూడొచ్చు. పూల రంగుల చొక్కా, కింద నల్లటి ప్యాంట్ తో దర్శనమిచ్చారు. బహుశా అది ట్రాక్ ప్యాంట్ అయి ఉండొచ్చు. దాని బొందు తాడులు వేలాడుతూ కనిపిస్తున్నాయి.

ఓ అభిమాని దీన్ని చలోక్తిగా మలిచాడు. అభిమాని ఏమన్నది, దానికి తాను ఏమని బదులిచ్చిందీ అమితాబచ్చన్ వెల్లడించారు. ‘బ్రదర్ మీ ట్యాగ్ వేలాడుతోంది’ అని ఓ అభిమాని తనతో అన్నట్టు అమితాబ్ తెలిపారు. ‘‘బ్రదర్ ఇది ప్యాంట్ తాడులు కాదు. నేటి తరం ఫ్యాషన్ సెన్స్ అలా ఉంది. అదే వేలాడుతోంది’’ అని తాను అన్నట్టు అమితాబ్ పేర్కొన్నారు. అమితాబ్ పోస్ట్ కు కామెంట్లు విపరీతంగా వస్తున్నాయి. దీన్ని క్యాప్షన్ ఆఫ్ ది ఇయర్ గా ఓ అభిమాని పేర్కొగా, బిగ్ బీ అన్ని కాలాల్లోనూ గొప్ప వారేనంటూ మరో అభిమాని పేర్కొనడం గమనార్హం.

  • Loading...

More Telugu News