Roja: సుప్రీంకోర్టులో కేసు వేస్తున్నా: రోజా

I filing case against Bandaru in Supreme Court says Roja
  • తనపై బండారు సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారన్న రోజా
  • ఆ వ్యాఖ్యలతో తన కుటుంబం చాలా అవమానపడిందని మండిపాటు
  • టీడీపీ, జనసేనలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శ
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి తనపై చేసిన దారుణ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టులో కేసు వేస్తానని ఏపీ మంత్రి రోజా తెలిపారు. బండారు లాంటి చీడపురుగులను ఏరివేయాల్సిన అవసరం ఉందని, మహిళలను ఒక్క మాట అనాలన్నా భయపడే పరిస్థితి రావాలని అన్నారు. తన గురించి బండారు చేసిన వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉన్నాయని ఆమె మండిపడ్డారు. ఒక మహిళ గురించి ఇంత దారుణంగా మాట్లాడటం ఊహ తెలిసినప్పటి నుంచి తనకు తెలియదని చెప్పారు. మహిళల పట్ల ఆయనకు ఉన్న సంస్కారం ఏమిటో తెలిసిందని అన్నారు. తన ఇంట్లో ఉన్న మహిళలకు, నియోజకవర్గంలోని మహిళలకు ఎంత గౌరవం ఇస్తాడో తెలిసిందని చెప్పారు. 

బండారు వంటి వ్యక్తికు బుద్ధి చెప్పేందుకు తాను పోరాటం చేస్తున్నానని తెలిపారు. ఒకవేళ అరెస్టయి, బెయిల్ వచ్చినంత మాత్రాన ఆయన తప్పు చేయనట్టు కాదని చెప్పారు. బండారు వ్యాఖ్యల వల్ల తన కుటుంబం చాలా అవమానపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేనలు ఉన్నది దిగజారుడు రాజకీయాలు చేసేందుకేనని చెప్పారు.
Roja
YSRCP
Bandaru
Telugudesam

More Telugu News