Nushrratt Bharuccha: సినిమాలో నటించిన సీన్ ఇప్పుడు నిజంగా అనుభవంలోకి.. ఇజ్రాయెల్ లో చిక్కుకున్న నుస్రత్ భరూచా

Embassy intervenes to bring back stranded Nushrratt Bharuccha in Israel amid conflict
  • ‘అకెల్లి’ సినిమాలో సరిగ్గా ఇలాంటి సీన్ లో నటించిన భరూచా
  • ఫిల్మ్ ఫెస్టివల్ కు వెళ్లి ఇజ్రాయెల్ లో చిక్కుకున్న వైనం
  • ప్రత్యేక విమానంలో ముంబై పంపిస్తున్న ఎంబసీ అధికారులు
బాలీవుడ్ హీరోయిన్ నుస్రత్ భరూచాకు గతంలో తాను నటించిన సినిమా సీన్ ఒకటి ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చింది. ప్రణయ్ మెష్రామ్ దర్శకత్వంలో వచ్చిన థ్రిల్లర్ డ్రామా ‘అకెల్లి’ సినిమాలో నుస్రత్ భరూచా నటించారు. ఇందులో ఆమె ఓ పోరాట ప్రాంతంలో చిక్కుకుని సురక్షితంగా బయట పడేందుకు కష్టపడే ఒక సాధారణ భారతీయ అమ్మాయి పాత్ర పోషించారు. అయితే దురదృష్టవశాత్తూ ఇప్పుడు కూడా ఆమె రియాలిటీలో అలాంటి పరిస్థితుల్లోనే చిక్కుకున్నారు.

హైఫా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరయ్యేందుకు భరుచా తన టీమ్ తో కలిసి ఇజ్రాయెల్ వెళ్లారు. సడెన్ గా యుద్ధం మొదలుకావడంతో ఇజ్రాయెల్ లో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో సైట్ సీయింగ్ కు వెళ్లిన భరూచాకు ఆమె టీమ్ కు కమ్యూనికేషన్ కట్ అయింది. దీనిపై ఆందోళన చెందిన భరూచా టీమ్.. ఇజ్రాయెల్ లోని భారత రాయబార కార్యాలయాన్ని ఆశ్రయించింది.

ఎంబసీ అధికారులు చొరవ తీసుకోవడంతో భరుచా ఎక్కడుందనే విషయం తెలిసిందని, భరూచాతో ఫోన్ లో మాట్లాడామని ఆమె టీమ్ తాజాగా వెల్లడించింది. ప్రస్తుతం ఆమె క్షేమంగా ఉందని వెల్లడించింది. కాగా, నుస్రత్ భరూచాను క్షేమంగా ఇండియా పంపించే ఏర్పాట్లు చేశామని, ప్రత్యేక విమానంలో భరూచా ముంబై బయలుదేరిందని ఎంబసీ అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు భరూచా ముంబైలో ల్యాండ్ అవుతారని వివరించారు.
Nushrratt Bharuccha
Bollywood actress
Haifi Film Festival
Israel war

More Telugu News