Bubble Gum: వెండితెరకు పరిచయం అవుతున్న రాజీవ్ కనకాల తనయుడు... రాజమౌళి చేతుల మీదుగా టైటిల్ విడుదల

Rajamouli releases Title of Rajeev Kanakala and Suma son Roshan debut movie Bubble Gum
  • బబుల్ గమ్ చిత్రంలో నటిస్తున్న రోషన్
  • రవికాంత్ పేరేపు దర్శకత్వంలో చిత్రం
  • టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన రాజమౌళి
  • రోషన్ కు ఆల్ ది బెస్ట్ చెప్పిన జక్కన్న

ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల, స్టార్ యాంకర్ సుమ దంపతుల తనయుడు రోషన్ వెండితెరకు పరిచయం అవుతున్నాడు. అగ్రశ్రేణి దర్శకుడు రాజమౌళి చేతుల మీదుగా ఈ చిత్రం టైటిల్ విడుదల కావడం విశేషం. ఈ సినిమా పేరు బబుల్ గమ్. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రాజమౌళి సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. రోషన్ కు ఆల్ ది బెస్ట్  చెప్పిన జక్కన్న... రాజీవ్ కనకాల, సుమ గర్వపడేలా కెరీర్ కొనసాగించాలని, సొంత శైలిలో నటించాలని సూచించారు. కాగా, బబుల్ గమ్ చిత్రానికి రవికాంత్ పేరేపు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో రోషన్ సరసన తెలుగమ్మాయి చెరుకూరి మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో మానస కూడా వెండితెర ఆరంగేట్రం చేస్తోంది.

  • Loading...

More Telugu News