Fire Accident: హైదరాబాదులో కేపీహెచ్ బీ మెట్రోస్టేషన్ వద్ద భారీ అగ్నిప్రమాదం

Huge fire accident at KPHB Metro Station in Hyderabad
  • ఓ ఫర్నిచర్ మాల్ లో మూడో అంతస్తులో చెలరేగిన మంటలు
  • కొద్దిసేపట్లోనే మిగతా ఫ్లోర్లకు పాకిన అగ్నికీలలు
  • నాలుగు ఫైరింజన్లతో శ్రమిస్తున్న అగ్నిమాపక సిబ్బంది
హైదరాబాదులో కేపీహెచ్ బీ మెట్రో స్టేషన్ వద్ద ఓ ఫర్నిచర్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇక్కడి సౌమ్య ఫర్నిచర్ షాపులో ఎగసిపడిన మంటలు కొద్దిసేపట్లోనే మరింత విస్తరించాయి. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మెట్రో స్టేషన్ ఎస్కలేటర్ మెట్ల మీదుగా పైకి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫర్నిచర్ మాల్ లోని మూడో అంతస్తులో మొదట మంటలు చెలరేగినట్టు తెలిసింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంలో భారీ ఆస్తి నష్టం సంభవించినట్టు అంచనా వేస్తున్నారు.
Fire Accident
Furniture Mall
KPHB Metro Station
Hyderabad

More Telugu News