ఏపీలో జగన్ కు తగ్గిన ఆదరణ.. టీడీపీకి పెరగనున్న లోక్ సభ సీట్లు: ఇండియా టీవీ - సీఎన్ఎక్స్ సర్వే
- వైసీపీకి 46 శాతం, టీడీపీకి 42 శాతం ఓట్లు వస్తాయన్న సర్వే
- వైసీపీ 7 పార్లమెంటు స్థానాలను కోల్పోనుందని వెల్లడి
- బీజేపీ, కాంగ్రెస్ లకు కేవలం 2 శాతం ఓట్లు మాత్రమే వస్తాయన్న సర్వే
ఏపీలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 25 లోక్ సభ సీట్లలో వైసీపీ 15 స్థానాలను గెలుచుకుంటుందని, టీడీపీ 10 చోట్ల గెలుస్తుందని సర్వే తెలిపింది. గత పార్లమెంటు ఎన్నికల్లో వైసీపీ 22 స్థానాల్లో గెలుపొందగా, టీడీపీ 3 స్థానాల్లో గెలిచింది. సర్వే ప్రకారం వైసీపీ 7 పార్లమెంట్ స్థానాలను కోల్పోనుంది. ఇదే సమయంలో టీడీపీ మరో 7 స్థానాలను తన ఖాతాలో వేసుకోనుంది. గత ఎన్నికల కంటే జగన్ కు ప్రజల్లో ఆదరణ కొంత మేర తగ్గిందని సర్వే తెలిపింది. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు ఒక్క స్థానంలో కూడా గెలవలేవని పేర్కొంది.