Gaddam VInod: మాజీ మంత్రి మొబైల్ నెంబర్ నుంచి వాట్సాప్ గ్రూప్ లో అశ్లీల వీడియోలు.. అనుచరుల షాక్ !
- బెల్లంపల్లిలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఘటన
- ఇదేం పనంటూ మాజీ మంత్రి వినోద్ పై నెటిజన్లు ఫైర్
- తన డ్రైవర్ చేసిన పనంటూ వివరణ ఇచ్చిన వినోద్
బెల్లంపల్లిలో బుధవారం రాత్రి షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఏకంగా మంత్రిగా చేసిన ఓ సీనియర్ నేత మొబైల్ నెంబర్ నుంచి వాట్సాప్ గ్రూప్ లో అశ్లీల వీడియోలు షేర్ కావడం కలకలం రేపింది. బుధవారం అర్ధరాత్రి ప్రాంతంలో షేర్ చేసిన ఈ వీడియోలను వెంటనే తొలగించారు. అయితే, గురువారం ఉదయం ఈ వీడియోలపై మిగతా గ్రూపుల్లో చర్చ జరిగింది. విషయం తెలియడంతో మాజీ మంత్రి స్పందిస్తూ.. ఇది తన డ్రైవర్ చేసిన పనంటూ వివరణ ఇచ్చారు. బెల్లంపల్లిలో కలకలం రేపిన ఈ ఘటన వివరాలు..
కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి గడ్డం వినోద్ మొబైల్ నెంబర్ నుంచి వాట్సాప్ గ్రూప్ లో అశ్లీల వీడియోలు పోస్ట్ అయ్యాయి. ఆ వెంటనే వాటిని తొలగించినా.. అప్పటికే పలువురు చూశారు. మరుసటి రోజు దీనిపై ఇతర గ్రూపుల్లో చర్చ జరిగింది. ఇదేంపనంటూ గడ్డం వినోద్ పై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయాన్ని కొంతమంది అనుచరులు వినోద్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మాజీ మంత్రి గడ్డం వినోద్ స్పందించారు. సామాజిక మాధ్యమాల్లో తాను అశ్లీల చిత్రాలు పోస్ట్ చేసినట్లు వస్తున్న వార్తలు నిజం కాదని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకునేందుకు తన వాహనంలో మరో మొబైల్ ఫోన్ ఉంచుతానని వివరించారు. ఆ ఫోన్ ను వాడుతూ తన డ్రైవరే ఈ పని చేశాడని తెలిపారు. అశ్లీల వీడియోల షేరింగ్ విషయంలో తనకు సంబంధం లేదని వినోద్ వివరణ ఇచ్చారు.