conistable jobs: ప్రమాదవశాత్తూ మరణించిన యువకుడు.. కానిస్టేబుల్ ఫలితాల్లో విజేత

Youth selected as conistable after accidental death in khammam district
  • టేకులపల్లి మండలం పాతతండా యువకుడు కానిస్టేబుల్ గా ఎంపిక
  • ఇటీవల ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్ కు గురై ప్రాణాలు వదిలిన వైనం
  • కన్నీటిపర్యంతం అవుతున్న యువకుడి తల్లిదండ్రులు

ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా కష్టపడి చదివాడు.. కానిస్టేబుల్ నియామక పరీక్ష రాసి సివిల్స్ కోసం ఢిల్లీ వెళ్లి శిక్షణ తీసుకుంటున్నాడు.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సెలవులు ఇవ్వడంతో స్నేహితుడిని కలిసేందుకు వెళ్లిన ఆ యువకుడు ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయాడు. టేకులపల్లి మండలం రాంపురం పంచాయతీ పరిధిలోని పాతతండాలో గత ఆగస్టులో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, తాజాగా ప్రకటించిన ఫలితాల్లో ఆ యువకుడు కానిస్టేబుల్ గా ఎంపికవడం విశేషం.

పాతతండాకు చెందిన భూక్య ప్రవీణ్ ఉన్నత ఉద్యోగం సాధించాలని కలలు కన్నాడు. బీటెక్ పూర్తి చేసి కానిస్టేబుల్ పరీక్షలు రాశాడు. ఆపై ఢిల్లీ వెళ్లి సివిల్స్ కు సిద్ధమయ్యేందుకు శిక్షణ తీసుకుంటున్నాడు. గత ఆగస్టులో స్నేహితుడిని కలిసేందుకు ఖమ్మం వెళ్లాడు. సిటీలో మిగతా స్నేహితులతో కలిసి ఫ్లెక్సీ కడుతుండగా ప్రమాదవశాత్తూ 11 కేవీ విద్యుత్ తీగ తగలడంతో షాక్ కు గురై అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో ప్రవీణ్ కుటుంబంలో విషాదం నెలకొంది. చేతికి అందివచ్చిన కొడుకు పెద్ద ఉద్యోగం సంపాదించి కుటుంబానికి అండగా ఉంటాడని వారు కన్న కలలన్నీ కల్లలయ్యాయి. తాజాగా ప్రవీణ్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడని తెలియడంతో ఆ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు.

  • Loading...

More Telugu News