Sajjala Ramakrishna Reddy: జగన్ ఢిల్లీకి వెళ్లడానికి కారణం ఇదే.. టీడీపీది తప్పుడు ప్రచారం: సజ్జల రామకృష్ణారెడ్డి

Jagan went to Delhi to discuss about funds says Sajjala Ramakrishna Reddy
  • కేసుల గురించి మాట్లాడేందుకే జగన్ ఢిల్లీకి వెళ్లారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న సజ్జల
  • రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించే ఢిల్లీకి వెళ్లారని వెల్లడి
  • స్కిల్ స్కాం డబ్బులు చంద్రబాబు ఖాతాలోకే వెళ్లాయని వ్యాఖ్య
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. కేసుల గురించి మాట్లాడేందుకు వెళ్లారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మాట్లాడేందుకే ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లారని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే కేంద్రం నుంచి జగనే ఎక్కువ నిధులను తీసుకొచ్చారని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబును జైల్లో పెట్టింది జగన్ కాదని... జైల్లో పెట్టింది కోర్టు అని చెప్పారు. చంద్రబాబు కేసులతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. 

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అన్ని ఆధారాలు ఉన్నాయని... చంద్రబాబు ఖాతాలోకే డబ్బులు వెళ్లాయని సీఐడీ చెప్పిందని సజ్జల తెలిపారు. అన్ని తప్పులు వారే చేసి, జగన్ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కుంభకోణంలో నారా లోకేశ్ సన్నిహితుడు కిలారి రాజేశ్ పాత్ర ఉందని చెప్పారు. జడ్జీలను, న్యాయవాదులను టీడీపీ శ్రేణులు, ఎల్లో మీడియా ఇష్టానుసారం దూషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Sajjala Ramakrishna Reddy
Jagan
YSRCP
Delhi
Chandrababu

More Telugu News