Chandrababu: ఈ నెల 19 వరకు చంద్రబాబుకు రిమాండ్ ను పొడిగించిన కోర్టు

ACB Court extends Chandrababu remand to OCT 19
  • స్కిల్ కేసులో చంద్రబాబు రిమాండ్ పొడిగింపు
  • కోర్టులో ఇరువైపు న్యాయవాదుల మధ్య వాగ్వాదం
  • బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా
టీడీపీ అధినేత చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టులో నిరాశ ఎదురయింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆయన రిమాండ్ ను ఈ నెల 19 వరకు కోర్టు పొడిగించింది. మరోవైపు చంద్రబాబు బెయిల్ పిటిషన్, సీఐడీ కస్టడీ పొడిగింపు పిటిషన్లపై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా ఇరు వైపుల న్యాయవాదుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇవాల్టితో చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ ముగిసింది. రిమాండ్ పొడిగింపు నేపథ్యంలో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉండనున్నారు. ఆయనకు బెయిల్ వస్తుందా? లేదా? అనే విషయం రేపు తేలనుంది.
Chandrababu
Telugudesam
ACB Court
Remand

More Telugu News