Ambati Rambabu: జనసేన రాజకీయ పార్టీ కాదు: మంత్రి అంబటి రాంబాబు

Minister Ambati Rambabu says Janasena is not a political party
  • పెడన బహిరంగ సభలో పవన్ వాడీవేడి ప్రసంగం
  • టీడీపీతో పొత్తు కారణాలు చెప్పిన జనసేనాని
  • జనసేన పార్టీని బలం మందు అని వర్ణించిన అంబటి
పెడన బహిరంగ సభలో జనసేనాని పవన్ కల్యాణ్ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. అంతేకాదు, టీడీపీతో నయా పొత్తుకు కారణాలు కూడా చెప్పారు. దాంతో, ఎప్పట్లాగానే వైసీపీ మంత్రులు, ఆ పార్టీ ప్రజాప్రతినిధులు పవన్ పై కారాలు మిరియాలు నూరుతున్నారు. 

తాజాగా, ఏపీ మంత్రి అంబటి రాంబాబు కూడా స్పందించారు. జనసేన రాజకీయ పార్టీ కాదు అని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ బలహీనపడినప్పుడు వాడే బలం మందు అని వర్ణించారు. పెడనలో పవన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో పరిస్థితులను దృష్టిలో ఉంచుకునే టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్టు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే టీడీపీ అనుభవం, జనసేన పోరాట పటిమ అవసరం అని స్పష్టం చేశారు.
Ambati Rambabu
Pawan Kalyan
YSRCP
Janasena
Political Party
Pedana
Andhra Pradesh

More Telugu News