Babar Azam: పాకిస్థాన్ కెప్టెన్ కోసం స్పెషల్ ఫ్లైట్ పంపించిన బీసీసీఐ.. ఎందుకంటే!

BCCI sends special flight to Pakistan captain Babar Azam
  • అహ్మదాబాద్ లో ప్రారంభమైన వన్డే వరల్డ్ కప్
  • తొలి మ్యాచ్ కు ముందు కెప్టెన్ల సమావేశం
  • బాబర్ ఆజమ్ కు హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్
2023 వన్డే ప్రపంచకప్ అహ్మదాబాద్ లో ప్రారంభమయింది. ఓపెనింగ్ సెర్మనీ వేడుకలు జరగకుండానే వరల్డ్ కప్ ను ప్రారంభించాయి. అయితే మ్యాచ్ కు ముందు వరల్డ్ కప్ లో పాల్గొంటున్న కెప్టెన్ల సమావేశం (కెప్టెన్స్ డే) జరిగింది. ఈ సమావేశం కోసం పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ కు బీసీసీఐ స్పెషల్ ఫ్లైట్ ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం పాక్ జట్టు హైదరాబాద్ లో ఉంది. రేపు హైదరాబాద్ లో పాకిస్థాన్ తన తొలి మ్యాచ్ ను నెదర్లాండ్స్ తో ఆడనుంది. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ లో కెప్టెన్ల సమావేశం ముగిసిన వెంటనే బాబర్ ఆజమ్ హైదరాబాద్ కు తిరుగు పయనం కానున్నాడు. మరోవైపు, కెప్టెన్ల సమావేశం సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, బాబర్ ఆజమ్ సరదాగా గడిపారు.

Babar Azam
Pakistan
Captain
BCCI
Special Flight

More Telugu News