కాంగ్రెస్ కూటమితో నారా కుటుంబం సంప్రదింపులు: విజయసాయి రెడ్డి
- టీడీపీని ఇండియా కూటమి భాగస్వామిగా పేర్కొన్న వైసీపీ ఎంపీ
- తెర వెనుక చర్చలు నిర్వహిస్తున్నారంటూ ట్వీట్
- త్వరలోనే అధికారిక బంధం ఖరారవుతుందన్న విజయసాయి
‘‘టీడీపీ స్పష్టంగా ఇండియా కూటమిలో భాగస్వామి. కాంగ్రెస్ ఎంపీ ఒకరు సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసును టేకప్ చేశారు. ఇండియా కూటమి సభ్యులు నారా కుటుంబంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తూనే ఉన్నారు. తెర వెనుక నిర్వహించే చర్చలు త్వరలోనే అధికారిక బంధానికి దారితీయనున్నాయి’’ అని విజయసాయి రెడ్డి తన ట్వీట్ లో పేర్కొన్నారు. ‘‘అందుకేనా సర్ ఢిల్లీ యాత్ర’’ అని ఒక యూజర్ కామెంట్ చేశారు. మీరు ఎన్డీయే అలయెన్స్ కదా అంటూ మరొక యూజర్ కామెంట్ చేయడం గమనార్హం.