శిఖర్ ధావన్ కు విడాకులు మంజూరు చేసిన కోర్టు
- భార్య మానసికంగా వేధిస్తోందంటూ కోర్టుకెక్కిన ధావన్
- సుదీర్ఘ విచారణ తర్వాత బుధవారం తీర్పు వెల్లడించిన జడ్జి
- కొడుకు కస్టడీపై ఆస్ట్రేలియా న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని సూచన
ఆయేషా ముఖర్జీ తనను డబ్బు కోసమే పెళ్లి చేసుకుందని, వివాహం జరిగిన తర్వాత ఆస్తులను తన పేరు మీదికి మార్చాలని వేధించడం మొదలు పెట్టిందని శిఖర్ ధావన్ 2020లో కోర్టు కెక్కారు. తన కష్టార్జితంతో ఆస్ట్రేలియాలో కొనుగోలు చేసిన మూడు ఆస్తుల విషయంలో తనను వేధించిందని ఆరోపించాడు. అందులో ఒక ఆస్తిని ఆయేషా సొంతం చేసుకోగా మిగతా రెండు ఆస్తులు తమ ఇద్దరి పేరు మీద ఉన్నాయని వివరించాడు. మిగతా రెండు ఆస్తులను కూడా తన పేరు మీదికి మళ్లించాలని గొడవ పడేదని చెప్పాడు. ఈ పిటిషన్ పై సుదీర్ఘంగా విచారణ జరిపిన ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు బుధవారం ధావన్ కు విడాకులు మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది.