Swades: ఘోర కారు ప్రమాదం నుంచి తప్పించుకున్న నటి గాయత్రి జోషి

Swades actress gayatri and husband Vikas Oberoi escape horrific car accident in Italy
  • ఇటలీలోని సార్డీనియాలో లగ్జరీ కార్ల ప్రదర్శన పోటీ
  • ఈ సందర్భంగా జరిగిన ప్రమాదం
  • న్యూజిలాండ్ దంపతుల దుర్మరణం
  • క్షేమంగా బయటపడిన గాయత్రీ జోషి, ఆమె భర్త

బాలీవుడ్ నటి గాయత్రీ జోషి, ఆమె భర్త వికాస్ ఒబెరాయ్ ప్రయాణిస్తున్న కారు ఇటలీలో ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం నుంచి నటి దంపతులు క్షేమంగా బయటపడ్డారు. 2004లో వచ్చిన స్వేడ్స్ సినిమాలో షారూక్ ఖాన్ సరసన నటించిన గాయత్రీ జోషి, తన నటనతో అభిమానులను మెప్పించడం తెలిసిందే.

సార్డీనియాలో లగ్జరీ కార్ల ప్రదర్శన పోటీ సందర్భంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయత్రీ జోషి, ఆమె భర్త ప్రాణాలతో బయటపడగా, స్విట్జర్లాండ్ కు చెందిన జంట ప్రాణాలను కోల్పోయింది. పలు వాహనాలు ఒకదాన్ని ఒకటి బలంగా ఢీకొన్నాయి. గాయత్రీ జోషి, ఆమె భర్త వికాస్ ప్రయాణిస్తున్న ఫెర్రారీ కారు, లంబోర్గిని కార్లు ముందున్న క్యాంపర్ వ్యాన్ ను క్రాస్ చేయబోతూ ఢీకొన్నాయి. వేగంగా వెళుతూ ముందున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ఈ ప్రమాదం అనంతరం ఫెరారీ కారు మంటల్లో చిక్కుకుంది. ఈ కారులో ఉన్న మెలీసా క్రౌటిల్ (63), మార్కస్ క్రౌటిల్ (67) ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాలు కాకుండానే  గాయత్రీ జోషి, వికాస్ ఒబెరాయ్ బయటపడినట్టు సమాచారం. ‘‘వికాస్, నేను ఇటలీలో ఉన్నాం. ఇక్కడ ఓ ప్రమాదానికి గురయ్యాం. భగవంతుడి దయతో మేము పూర్తి క్షేమంగా ఉన్నాం’’ అని గాయత్రీ జోషి ప్రకటించింది.

  • Loading...

More Telugu News