Chandrababu: చంద్రబాబు టీడీపీ, జనసేన పొత్తుపై మాట్లాడారు: చినరాజప్ప

Chinarajappa met Chandrababu in Jail
  • జైల్లో చంద్రబాబును కలిసిన నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, చినరాజప్ప
  • చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారన్న చినరాజప్ప
  • టీడీపీ అధినేత ధైర్యంగా కనిపించారని వెల్లడి
  • టీడీపీ, జనసేన ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళ్లాలని సూచించారని వివరణ

టీడీపీ సీనియర్ నేత, మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఇవాళ నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలతో కలిసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. 

చంద్రబాబును కలిసి మాట్లాడిన అనంతరం, జైలు వెలుపలికి వచ్చిన చినరాజప్ప మీడియాకు వివరాలు తెలిపారు. జనసేనతో టీడీపీ పొత్తుపై ముందుకెళ్లాలని చంద్రబాబు స్పష్టం చేశారని వెల్లడించారు. రెండు పార్టీలు ఉమ్మడి కార్యాచరణ చేపట్టాలని సూచించారని వివరించారు. 

చంద్రబాబు జైల్లో ఆరోగ్యంగానే ఉన్నారని, ధైర్యంగా కనిపించారని చినరాజప్ప తెలిపారు. టీడీపీ కార్యకర్తలను కూడా ధైర్యంగా ఉండమని చెప్పారని వెల్లడించారు. చంద్రబాబు ఆందోళన అంతా రాష్ట్రం కోసమేనని అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలనపై పోరాటం మాత్రం ఆపొద్దని స్పష్టంగా చెప్పారని చినరాజప్ప పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News