Pawan Kalyan: పాదయాత్రలో ఏది నోటికొస్తే అది వాగ్దానం చేశారు: పవన్ కల్యాణ్

Pawan Kalyan fires on Jagan
  • అధికారం కోసం జగన్ ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చారన్న పవన్
  • హామీలను నెరవేర్చకుండా మోసం చేశారని విమర్శ
  • వికలాంగులకు మేలు చేయడంలో విఫలమవుతున్నారని మండిపాటు
ముఖ్యమంత్రి జగన్ పై జనసేన అధినేత మరోసారి విమర్శలు గుప్పించారు. అధికారం కోసం ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చారని విమర్శించారు. పాదయాత్ర చేస్తున్న సమయంలో నోటికి ఏదొస్తే అది హామీగా ఇచ్చేశారని దుయ్యబట్టారు. అప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. మచిలీపట్నంలో నిర్వహించిన జనవాణిలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జనవాణిలో పవన్ ను విద్యుత్ మీటర్ల రీడర్లు కలిశారు. తమకు పని భారాన్ని విపరీతంగా పెంచి పొమ్మనకుండా పొగ పెడుతున్నారని వారు వాపోయారు. 

మరోవైపు పవన్ ను కలిసిన వికలాంగులు... ప్రభుత్వాలు మారినా తమ తలరాతలు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ కోట్లు ఖర్చు చేస్తున్నా, వారికి మేలు చేయడంలో విలమవుతున్నారని చెప్పారు. ఇంట్లో ఇద్దరు, ముగ్గురు ఉంటే... ఒక్కరికే పెన్షన్ అంటే ఎలాగని ఆయన ప్రశ్నించారు.  

Pawan Kalyan
Janasena
Jagan
YSRCP

More Telugu News