బైక్ మీద వచ్చి, నోట్ల కట్ట విసిరేసి ఐఫోన్ కొన్న కుర్రాడు.. వీడియో వైరల్

Boy attitude while buying an iPhone went viral
  • ఐఫోన్ కోసం ఆరాటపడుతున్న యువత
  • ఐఫోన్ కొనేందుకు వెళ్లి తన యాటిట్యూడ్ తో వార్తల్లో నిలిచిన కుర్రాడు
  • వీడియోను షేర్ చేసిన  ఓ చార్టర్డ్ అకౌంటెంట్
ఎంత ఖరీదైన ఫోన్లు అందుబాటులో ఉన్నా చేతిలో ఐఫోన్ ఉంటే ఆ కిక్కే వేరు. ఐఫోన్ కొనాలని చాలా మంది లక్ష్యంగా పెట్టుకుంటారు. కొత్త ఐఫోన్ ను చేతిలో పట్టుకొని మురిసిపోతుంటారు. ముఖ్యంగా యువత ఐఫోన్ కోసం ఎంతో ఆరాటపడుతుంటుంది. ఇలాంటి కోవకే చెందిన ఓ కుర్రాడు మొబైల్ స్టోర్ కి వెళ్లి ఐఫోన్ కొనుగోలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సదరు కుర్రాడు బైక్ పై స్టయిల్ గా దిగి సోర్ట్ కు వెళ్లాడు. అక్కడి సోఫాలో స్నేహితులతో కలిసి కాలు మీద కాలేసుకొని కూర్చున్నాడు. వెంట తెచ్చుకున్న 500 రూపాయాల నోట్ల కట్టను లెక్కపెట్టాడు. కట్టను టేబుల్ పైకి విసిరేసి ఐఫోన్ కొన్నాడు. అక్కడే దాన్ని ఓపెన్ చేసి ఎంతో సాధించాను అన్నట్టుగా మురిసిపోయాడు. పరాస్ గంగ్వాల్ అనే చార్టర్డ్ అకౌంటెంట్ ఈ వీడియోను తన ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్లో షేర్ చేశారు. ఐఫోన్ కొంటున్న ఈ కుర్రాడి యాటిట్యూడ్ చూడండి అని క్యాప్షన్ ఇచ్చారు. ఆ కుర్రాడు ఎవరు? ఎక్కడ జరిగింది? అనే విషయాలు తెలియకున్నా.. ఈ వీడియోకు ఇప్పటికే దాదాపు నాలుగు లక్షల వ్యూస్ వచ్చాయి.
Go Back to Shorts
Young boy
iphone
attitude
Viral Videos
Twitter

More Telugu News