Aishwarya Rai: క్యాట్ వాక్ తో కిర్రెక్కించిన ఐశ్వర్యారాయ్

Aishwarya Rai winks blows kisses as she walks the ramp at Paris event
  • ప్యారిస్ ఫ్యాషన్ వీక్ లో మెరిసిన ఐశ్వర్య
  • క్యాట్ వాక్ చేస్తూ ఫ్లయింగ్ కిస్
  • యువ ఫ్యాషన్ మోడళ్లకు ఏమాత్రం తగ్గని విధంగా ప్రదర్శన

ఐశ్వర్యారాయ్ బచ్చన్ ఈ వయసులోనూ యువ ఫ్యాషన్ మోడళ్లతో సమానంగా క్యాట్ వాక్ చేసి అభిమానులను హుషారెత్తించారు. ఐశ్వర్యారాయ్ కు 49 ఏళ్లు. 12 ఏళ్ల కుమార్తె ఆరాధ్య బచ్చన్ కు తల్లి. వయసు అనేది కేవలం ఒక నంబర్ అని ఎక్కువ మంది నటీనటులు నమ్ముతుంటారు. ఐశ్వర్య అంత పెద్ద వయసులోనూ చలాకీగా క్యాట్ వాక్ చేయడం చూసే వారికి ఆసక్తిని కలిగించింది. 

ప్యారిస్ ఫ్యాషన్ వీక్ లో ఈ దృశ్యం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లోకి చేరాయి. ఐశ్వర్య వయసు తగ్గిందా? అన్నట్టుగా ఆమె ప్రదర్శన కనిపించింది. బ్రౌన్, గోల్డెన్ డ్రెస్ ధరించి, హెయిర్ కలర్ ను కూడా అందుకు అనుగుణంగా మార్చేశారు. ఆడియన్స్ చూసి ఐశ్వర్యారాయ్ చిలిపిగా కన్ను కొట్టడమే కాదు, ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చి ఔరా అనిపించింది.

  • Loading...

More Telugu News