Senthamarai Stalin: ఆలయంలో తమిళనాడు సీఎం స్టాలిన్ కుమార్తె పూజలు.. వీడియో వైరల్.. మళ్లీ రేగిన దుమారం

Tamil Nadu CM MK Stalin daughter Senthamarai Stalin visited Sattainathar Temple
  • సత్తైనాథర్ ఆలయాన్ని సందర్శించిన స్టాలిన్ కుమార్తె సెంథామరై స్టాలిన్
  • పూజలు చేసి హారతి కళ్లకు అద్దుకున్న సీఎం కుమార్తె
  • ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల నేపథ్యంలో దుమారం
సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి, సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా సమసిపోకముందే ఇప్పుడు మరో వార్త దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. దీనికి కారణం స్టాలిన్ కుమార్తె సెథామరై స్టాలిన్ ఆలయంలో ప్రార్థనలు చేయడమే.

మైలాడుతురై జిల్లాలో సిర్కాజీలోని సత్తైనాథర్ దేవాలయంలో సెంథామరై నిన్న పూజలు చేశారు. హారతి కళ్లకు అద్దుకున్నారు. అనంతరం పూజారి పళ్లెంలో దక్షిణ వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. దీనిని ఏమంటారని ప్రశ్నిస్తున్నారు. ఇది సనాతన ధర్మం కాదా? అని ట్రోల్స్‌తో విరుచుకుపడుతున్నారు.
Senthamarai Stalin
Tamil Nadu
Udhayanidhi Stalin
Sattainathar Temple

More Telugu News