మోదీజీ మీరు చేసింది సున్నా.. మీ పార్టీకి వచ్చేది పెద్ద సున్నానే: కేటీఆర్
- తెలంగాణలో బీజేపీకి వచ్చేవి సున్నా సీట్లేనన్న కేటీఆర్
- ప్రధాని మోదీ పాలమూరు పర్యటన నేపథ్యంలో సెటైర్
- పాలమూరుప్రాజెక్టుకు ఏం చేశారని ప్రశ్నించిన మంత్రి
‘పీఎం నరేంద్ర మోదీజీ. 2014లో పాలమూరు నీటిపారుదల ప్రాజెక్టుల పట్ల యూపీఏ ప్రభుత్వ ఉదాసీన వైఖరిని మీరు ప్రశ్నించారు. 10 సంవత్సరాలుగా నిద్రపోతున్నారా అని ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కానీ, మీ ప్రభుత్వం వచ్చాక చేసిందేంటి? మహబూబ్‌నగర్‌పై బీజేపీ ఉదాసీనతకు ఇప్పుడు మరో పదేళ్లు గడిచిపోయాయి. ఈ పదేళ్లలో పాలమూరు అభివృద్ధికి మీరేం చేశారో ఈ రోజు అద్దంలో చూపించాలని అనుకుంటున్నా. ఇన్నేళ్లలో మీరు పాలమూరుకు చేసింది శూన్యం. కాబట్టి వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మీ బీజేపీ పార్టీకి ఇచ్చే సీట్లు కూడా పెద్ద సున్నానే’ అని కేటీఆర్ పేర్కొన్నారు.