Team India: టీమిండియా, ఇంగ్లండ్ వార్మప్ మ్యాచ్ వర్షార్పణం

Team India warm up match with England abandoned due to rain
  • టీమిండియా వరల్డ్ కప్ సన్నద్ధతకు అడ్డుతగిలిన వరుణుడు
  • నేడు గువాహటిలో టీమిండియా, ఇంగ్లండ్ ప్రాక్టీసు మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
  • ఎడతెరిపిలేని వానతో ఒక్క బంతి పడకుండానే మ్యాచ్ రద్దు
మరో ఆరు రోజుల్లో ఐసీసీ వరల్డ్ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా సన్నద్ధతకు వరుణుడు అడ్డుపడ్డాడు. ఇవాళ ఇంగ్లండ్ తో టీమిండియా ఆడాల్సిన వార్మప్ మ్యాచ్ వర్షార్పణం అయింది. మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న గువాహటిలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో మ్యాచ్ ను రద్దు చేశారు. దాంతో, టీమిండియా, ఇంగ్లండ్ జట్లు ఎలాంటి ప్రాక్టీసు లేకుండానే వెనుదిరిగాయి. ఈ మధ్యాహ్నం టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా మైదానాన్ని కవర్లతో కప్పివేశారు. ఇక, టీమిండియా తన రెండో వార్మప్ మ్యాచ్ ను అక్టోబరు 3న నెదర్లాండ్స్ తో ఆడనుంది. ఈ మ్యాచ్ కు తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియం వేదికగా నిలవనుంది.
Team India
Warm Up Match
England
Abandon
Rain
Guwahati
ICC World Cup

More Telugu News