అక్టోబరు 16న విశాఖలో ఇన్ఫోసిస్ ను ప్రారంభించనున్న సీఎం జగన్
- విశాఖలో ఇన్ఫోసిస్ ఐటీ సెంటర్ ఏర్పాటు
- మంత్రి అమర్నాథ్ తో ఇన్ఫోసిస్ అధికారుల సమావేశం
- ఎక్స్ లో వెల్లడించిన మంత్రి అమర్నాథ్
విశాఖ ఇన్ఫోసిస్ కేంద్రంలో తొలుత 650 మందితో కార్యకలాపాలు నిర్వహించనున్నారు. త్వరలోనే 1000 మందితో సేవలు అందించేలా విస్తరించనున్నారు. విశాఖ నుంచి సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్, ఐటీ అనుబంధ సేవలు, ఎంటర్ ప్రైజ్ అప్లికేషన్స్ తదితర సేవలు అందించాలని ఇన్ఫోసిస్ భావిస్తోంది.