ram potineni: రెండ్రోజుల్లో ‘స్కంద' కలెక్షన్స్​ ఎంతంటే!

Skanda Movie two days collections report
  • రామ్, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం
  • 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల
  • రెండు రోజుల్లో రూ. 12.11 కోట్ల షేర్
రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన మాస్ ఎంటర్‌‌టైనర్  'స్కంద'. అందాల నటి శ్రీలీల హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. రామ్‌ కెరీర్‌‌లో ఇది తొలి ప్యాన్‌ ఇండియా చిత్రం. సినిమాకు మిక్స్‌డ్‌ టాక్ వచ్చింది. మొదటి రోజు రామ్ కెరీర్ లో అత్యధికంగా ఓపెనింగ్స్ సాధించింది. తొలి రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమా రూ. 8.62 కోట్లు రాబట్టింది. రెండో రోజు రూ.3.49 కోట్ల రూపాయలు షేర్ తెచ్చుకుంది. మొత్తంగా రెండ్రోజుల్లో కలిపి ఈ సినిమాకు 12.11 కోట్ల షేర్ లభించింది. వారాంతంలో శని, ఆదితో పాటు సోమవారం గాంధీ జయంతి సందర్భంగా సెలవు కావడంతో కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని చిత్ర బృందం భావిస్తోంది.
ram potineni
Boyapati Sreenu
skanda
sreeleela

More Telugu News