Actor Ravi Babu: సినిమా వాళ్ల గ్లామర్, రాజకీయ నాయకుల పవర్, చంద్రబాబు కష్టాలు ఏవీ శాశ్వతం కాదు: రవిబాబు

  • చంద్రబాబు అరెస్ట్ ను తప్పుపట్టిన సినీ నటుడు రవిబాబు
  • 73 ఏళ్ల చంద్రబాబును జైల్లో పెట్టి హింసిస్తున్నారని ఆవేదన
  • చంద్రబాబును జైలు నుంచి విడుదల చేయాలని విన్నపం
Actor Ravi Babu condemns Chandrababu arrest

టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడాన్ని సినీ నటుడు, దర్శకుడు రవిబాబు తప్పుబట్టారు. ప్రజల సొమ్ము కోసం కక్కుర్త పడే రకం చంద్రబాబు కాదని అన్నారు. అనుక్షణం ప్రజల కోసం తపన పడే చంద్రబాబును ఆధారాలు లేకుండా అక్రమ కేసులు పెట్టి, జైల్లో ఉంచి ఎందుకు హింసిస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. రాజకీయాల్లో ఎత్తులు, పైఎత్తులు వేయడం సహజమేనని... అయితే, 73 ఏళ్ల వయసున్న చంద్రబాబును జైల్లో పెట్టి హింసించడం ఏ రకమైన రాజకీయ ఎత్తుగడో తనను అర్థం కావడం లేదని విమర్శించారు. 

అశాశ్వతమైన పవర్ ఉన్న వాళ్లను ఒకటే కోరుతున్నానని... ఏ పవర్ నైతే ఉపయోగించి చంద్రబాబును జైల్లో పెట్టించారో, అదే పవర్ ను ఉపయోగించి ఆయనను వదిలేయాలని విన్నవించారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇష్టం వచ్చినట్టు విచారించుకోవాలని చెప్పారు. చంద్రబాబును వదిలేస్తే మిమ్మల్ని జాలి మనసు, విలువలు ఉన్న వ్యక్తుల్లా చరిత్ర గుర్తుంచుకుంటుందని అన్నారు. 

మనిషి జీవితంలో ఏదీ శాశ్వతం కాదని రవిబాబు అన్నారు. రాజకీయ నాయకుల పవర్ కానీ, సినిమా వాళ్ల గ్లామర్ కానీ శాశ్వతం కాదని చెప్పారు. ఎన్టీ రామారావు, చంద్రబాబు కుటుంబాలు తమ కుటుంబానికి ఆప్తులని అన్నారు. చంద్రబాబుకు వచ్చిన కష్టాలు త్వరలోనే తొలగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఏ పని చేయాలన్నా వంద యాంగిల్స్ లో ఆలోచిస్తారని, అందరినీ సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.  

More Telugu News