RBI: నేటితో ఆర్బీఐ ఇచ్చిన గడువు పూర్తి! రేపటి నుంచీ రూ.2 వేల నోట్లు చెల్లవా?

RBI deadline for exchanging rs 2 thousand notes ends today what happens tomorrow
  • రూ.2 వేల నోటు మార్పిడికి నేడే డెడ్‌లైన్
  • రేపటి నుంచి ఆర్థిక లావాదేవీలకు ఈ నోటు ఉపయోగపడదంటూ గతంలోనే ఆర్బీఐ ప్రకటన
  • లీగల్ టెండర్‌గా మాత్రం కొనసాగుతుందని స్పష్టీకరణ
  • అక్టోబర్ 1 నుంచి ఆర్బీఐ శాఖల్లో మాత్రమే నోటును మార్చుకునే ఛాన్స్

రెండు వేల రూపాయల నోటును ఆర్బీఐ ఉపసంహరించుకున్నట్టు గతంలోనే ప్రకటించింది. సెప్టెంబర్ 30 లోపు ప్రజలు తమ వద్ద ఉన్న రెండు వేల నోట్లను బ్యాంకుల్లో జమ చేయాలని గడువు విధించింది. నేటితో ఆ గడువు పూర్తి కానుంది. మరి రేపటి నుంచీ రూ.2 వేల నోటు చెల్లదా? అనే సందేహం మనలో చాలా మందికి కలిగే ఉంటుంది. అయితే, ఆర్బీఐ గతంలోనే ఈ ప్రశ్నకు సవివరమైన సమాధానం ఇచ్చింది. 

సెప్టెంబర్ 30లోపు ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను బ్యాంకుల్లో జమ చేయాలని మే 16న ఆర్బీఐ ప్రకటించింది. అక్టోబర్ 1 నుంచీ ఈ నోటుతో ఎటువంటి ఆర్థిక లావాదేవీలు జరిపేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది. అయితే, నోటు మాత్రం యథావిధిగా లీగల్ టెండర్‌గా కొనసాగుతుంది. అంటే.. ప్రజలు అక్టోబర్ 1 నుంచీ ఈ నోటును కేవలం ఆర్బీఐ శాఖల్లో మాత్రమే మార్చుకోగలరు. మునుపటి వలే బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం లేదా బ్యాంకుల్లోనే ఇతర నోట్లుగా మార్చుకోవడం కుదరదు. 

అయితే, అక్టోబర్ నుంచీ ఆర్బీఐ శాఖల్లో ఈ నోట్లు మార్చుకునే వారు పాత డెడ్‌లైన్ ఎందుకు మిస్సయ్యారో చెప్పాల్సి ఉంటుంది.

  • Loading...

More Telugu News