Wagner Group: కిరాయి సైనిక దళం వాగ్నర్‌ గ్రూపునకు కొత్త అధిపతి నియామకం

putin appoints Andrei troshev as chief of wagner group
  • కిరాయి సైనిక దళం వాగ్నర్ గ్రూపునకు కొత్త అధిపతిని నియమించిన రష్యా అధ్యక్షుడు 
  • గ్రూపులోని కీలక కమాండర్‌ ఆండ్రీ ట్రోషెవ్‌కు పగ్గాలు అప్పగించిన అధ్యక్షుడు పుతిన్
  • గతంలో రష్యా సైన్యంలో పనిచేసిన ట్రోషెవ్
  • 2014లో వాగ్నర్ గ్రూపులో చేరిక
  • ఇకపై ఉక్రెయిన్‌లో వాగ్నర్ గ్రూపు కార్యకలాపాలను పర్యవేక్షించనున్న ఆండ్రీ
కిరాయి సైనిక దళం వాగ్నర్ గ్రూపునకు కొత్త అధిపతిగా ఆండ్రీ ట్రోషెవ్‌ను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎంపిక చేశారు. ఈ గ్రూపు చీఫ్ ప్రిగోజిన్ ఇటీవల అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై తిరుగుబాటు అనంతరం అకస్మాత్తుగా ఆయన మరణించడం అనేక సందేహాలకు తావిచ్చింది. 

కాగా, వాగ్నర్ గ్రూపు కొత్త అధ్యక్షుడు ఈ సైనిక దళంలోనే పలు స్థాయిల్లో పనిచేశారు. వాగ్నర్ గ్రూపు ముఖ్య కమాండర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలోనే ఈ మిలిటరీ దళం బాధ్యతలను పుతిన్ ఆండ్రీకి అప్పగించారు. ఆండ్రీ గతంలో రష్యా సైన్యంలో కూడా పనిచేశారు. 2014లో వాగ్నర్ గ్రూపులో చేరారు. గ్రూపు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ హోదాలో సిరియాలో పోరాట కార్యకలాపాలను పర్యవేక్షించారు. ఆండ్రీపై ఐరోపా సమాఖ్య అనేక ఆంక్షలు విధించింది. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో పోరాడుతున్న వాగ్నర్ గ్రూపు దళాల పర్యవేక్షణ బాధ్యతను పుతిన్ ఆండ్రీకి అప్పగించారని అక్కడి వర్గాలు పేర్కొన్నాయి.
Wagner Group
Vladimir Putin
Russia
Ukraine

More Telugu News