Nara Brahmani: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా విజ్ఞప్తి ఇదే!: నారా బ్రాహ్మణి

  • పాలకుల అక్రమాలకు అడ్డు చెప్పకపోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్న బ్రాహ్మణి
  • ప్రజలు మౌనంగా ఉంటే అన్యాయం చెలరేగిపోతుందని హెచ్చరిక
  • చంద్రబాబు గురించి మీకు బాగా తెలుసు... అక్రమ నిర్బంధన తప్పని చెప్పండని పిలుపు
Nara Brahmani tweet on Motha Mogiddam

అక్రమాలను ప్రశ్నించాలని లేదంటే అది ప్రమాదకరమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అర్ధాంగి నారా బ్రాహ్మణి అన్నారు. ఆమె సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. రేపు రాత్రి ఏడు గంటల నుంచి ఏడు గంటల ఐదు నిమిషాల వరకు అంటే 5 నిమిషాల పాటు టీడీపీ ఆధ్వర్యంలో మోత మోగిద్దాంకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో నారా బ్రాహ్మణి ట్వీట్ చేశారు.

'పాలకుల అక్రమాలకు అడ్డు చెప్పకపోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ముఖ్యంగా ప్రజలు మౌనంగా ఉంటే అన్యాయం చెలరేగిపోతుంది. అందుకే ఏపీ ప్రజలకు నా విజ్ఞప్తి! చంద్రబాబు గురించి మీకు బాగా తెలుసు. ఆయన్ని అక్రమంగా నిర్బంధించడం తప్పు అని చెప్పండి.  

చంద్రబాబుకు మద్దతుగా సెప్టెంబర్ 30, రాత్రి 7 నుండి  7.05 గంటల వరకు 5 నిమిషాల పాటు వీధుల్లోకి వచ్చి గంటలు మోగించండి. లేదా ఒక పళ్లెం తీసుకుని గరిటెతో కొట్టండి. విజిల్ వేయండి. రోడ్డు ప్రయాణంలో ఉంటే హారన్ కొట్టండి. మొత్తమ్మీద ఏదో ఒక శబ్దం చేసి ప్రభుత్వానికి మీ నిరసన తెలియజేయండి' అని ట్వీటీ చేశారు.

More Telugu News