స్వల్ప మోతాదులో విస్కీ తీసుకుంటే మేలు చేస్తుందా?
- స్వల్పంగా తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు
- గుండె జబ్బులు, స్ట్రోక్ రిస్క్ తగ్గుతుంది
- వ్యాధి నిరోధక శక్తి బలపడుతుంది
- మోతాదు మించితే దీర్ఘకాలంలో ప్రాణాంతకం
మంచి - చెడు
- విస్కీలో పాలీఫెనాల్స్ అధికంగా ఉంటాయి. ఇవి మొక్కల ఆధారిత యాంటీ ఆక్సిడెంట్లు. ఈ పాలీ ఫెనాల్స్ గుండె జబ్బుల నుంచి రక్షణ కల్పిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. ధమనుల గోడల్లో పేరుకున్న కొలెస్ట్రాల్ కరిగిపోవడంతో గుండె జబ్బులు, స్ట్రోక్ రిస్క్ తగ్గుతుంది.
- విస్కీని స్వల్ప మోతాదులో తీసుకుంటే సైనస్ గ్రంధుల్లో, ఛాతీలో పేరుకున్న మ్యూకస్ తొలగిపోతుంది. దీంతో జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. రక్త నాళాలను విస్కీ వ్యాకోచించేలా చేస్తుంది. దీంతో ఛాతీ, సైనస్ గ్రంధుల్లో పేరుకున్న కఫం సులభంగా అక్కడి నుంచి జారిపోతుంది.
- ప్లాంట్ ఆధారిత యాంటీ ఆక్సిడెంట్లు మెదడులో రసాయనాల సమతుల్యానికి తోడ్పడతాయి.
- విస్కీలో కార్బోహైడ్రేట్లు ఉండవు. కనుక మధుమేహులు దీన్ని తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ పెరిగే ప్రమాదం ఉండదు.
- ఆహారం అనంతరం విస్కీని స్వల్ప మోతాదులో తీసుకుంటే.. ఆహారం సాఫీగా జీర్ణమై పేగుల్లోకి వెళ్లిపోతుంది.
- విస్కీని స్వల్పంగా తీసుకునేవారికి డిమెన్షియా రిస్క్ చాలా వరకు తొలగిపోతుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.
- విస్కీతో ప్రయోజనాలు అనేవి స్వల్ప మోతాదులో తీసుకున్నప్పుడే సుమా! మోతాదు మించి తాగితే అది దీర్ఘకాలంలో ప్రాణాంతకంగా మారుతుందని వైద్యులు చెబుతుంటారు. ఎక్కువ మోతాదులో తాగితే లివర్ పనితీరు దెబ్బతింటుంది. కాలేయ వైఫల్యానికి దారితీస్తుంది. లివర్ సిర్రోసిస్ ఏర్పడుతుంది.
- ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే నోరు, కాలేయం, ఈసోఫాజియస్, కొలన్, పాంక్రియాటిక్ కేన్సర్లు తలెత్తే ప్రమాదం ఏర్పడుతుంది.