Punjab: పోలీసు వాహనంపై యువతి ఇన్‌స్టా రీల్స్‌కు అనుమతించిన అధికారిపై వేటు

Jalandhar cop suspended for allowing woman to use police vehicle for her insta reels
  • పంజాబ్‌లోని జలంధర్ నగరంలో ఘటన
  • ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో చెలరేగిన విమర్శలు
  • ఇందుకు బాధ్యుడైన పోలీసు అధికారిపై సస్పెన్షన్ వేటు
పోలీసు వాహనంపై కూర్చుని ఇన్స్‌స్టా రీల్స్ చేసుకునేందుకు ఓ యువతిని అనుమతించిన పోలీసు అధికారిపై వేటు పడింది. విషయం ఉన్నతాధికారుల దృష్టికి చేరిన వెంటనే వారు ఆ పోలీసును సస్పెండ్ చేశారు. పంజాబ్‌లోని జలంధర్‌ నగరంలో ఈ ఘటన వెలుగు చూసింది. స్టేషన్ హౌస్ ఆఫీసర్ అశోక్ శర్మ, యువతి కారుపై కూర్చుని వీడియో రికార్డు చేసేందుకు అనుమతించారు. దీంతో, ఆమె కారు బానెట్‌పై కూర్చుని డ్యాన్స్ చేస్తున్నట్టు చేతులు ఊపింది. అంతేకాకుండా, అభ్యంతరకర రీతిలో వేళ్లతో సైగలు చేసింది. 

ఈ వీడియో సోషల్ మీడియా బాట పట్టడంతో నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో, దిద్దుబాటు చర్యలకు దిగిన పోలీసు శాఖ అశోక్ శర్మను సస్పెండ్ చేసింది. ఇటీవలే మరో యువతి ఇదే తరహాలో కదులుతున్న కారు బానెట్‌పై కూర్చుని ఇన్‌స్టా రీల్స్ చేయడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. తన అకౌంట్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్య ఒక మిలియన్ దాటిన సందర్భాన్ని పురస్కరించుకుని యువతి ఇలాంటి రీల్ చేసి చిక్కుల్లో పడింది.
Punjab
Jalandhar

More Telugu News