YS Jagan: ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమైన గౌతమ్ అదానీ.. ఇద్దరూ కలిసి డిన్నర్!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. గురువారం సాయంత్రం అహ్మదాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న అదానీ, అక్కడి నుంచి తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఆ తర్వాత పలు అంశాలపై సీఎం జగన్‌తో అదానీ చర్చించినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఇరువురు కలిసి డిన్నర్ చేయనున్నారు.