ఏపీ రాజకీయాల్లో దోమల గొడవ.. రాజమండ్రి జైలు చుట్టూ ఫాగింగ్
- రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా చంద్రబాబు
- ఇటీవల డెంగ్యూతో ప్రాణాలు కోల్పోయిన ఓ రిమాండ్ ఖైదీ
- చంద్రబాబు భద్రతపై టీడీపీ ఆందోళన
సెంట్రల్ జైలు చుట్టూ పెద్ద సంఖ్యలో వృక్షాలు, మొక్కలు ఉండడంతో దోమల బాధ ఎక్కువగా ఉంటుందని అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో దోమల బెడదను నివారించేందుకు ఫాగింగ్ చేయించారు. జైలు ప్రాంగణంతోపాటు పరిసరాల్లోని చెట్లు పుట్టలు, పొదల్లో కూడా మున్సిపల్ సిబ్బంది ఫాగింగ్ కార్యక్రమం చేపట్టారు. ఖైదీల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జైలు అధికారులు వివరించారు.