World Rankings: వరల్డ్ ర్యాంకింగ్స్ లో 91 భారత వర్సిటీలకు చోటు

91 Indian universities gets place in global rankings
  • గ్లోబల్ వర్సిటీ ర్యాంకింగ్స్ ప్రకటించిన టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ విభాగం
  • రికార్డు స్థాయిలో స్థానం దక్కించుకున్న భారత విద్యాసంస్థలు
  • 2016లో ఈ జాబితాలో భారత విద్యాసంస్థల సంఖ్య 16
  • ఈసారి టాప్-250లో నిలిచిన ఐఐఎస్ సీ బెంగళూరు
టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ విభాగం తాజాగా విడుదల చేసిన వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్-2024 జాబితాలో భారత్ కు చెందిన 91 విద్యాసంస్థలు చోటు దక్కించుకున్నాయి. గతంలో ఇన్ని భారత విశ్వవిద్యాలయాలు ప్రపంచ ర్యాంకింగ్స్ లో స్థానం దక్కించుకోలేదు. 2016లో ఈ జాబితాలో భారత్ కు చెందిన వర్సిటీల సంఖ్య కేవలం 16. ఇప్పుడు ఆ సంఖ్య 91కి పెరిగింది. 

భారత్ లోని అగ్రగామి విద్యాసంస్థ ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్ సీ)-బెంగళూరు ఈ జాబితాలో టాప్-250లో స్థానం దక్కించుకుంది. దక్షిణాదిన పేరుగాంచిన అన్నా యూనివర్సిటీ టాప్-600లో ఉంది. జామియా మిలియా ఇస్లామియా, మహాత్మాగాంధీ వర్సిటీ, శూలిని యూనివర్సిటీ ఆఫ్ బయోటెక్నాలజీ కూడా టాప్-600లో ఉన్నాయి. ఐఐటీ-గువాహటి టాప్-800లో నిలిచింది. 

ఈ గ్లోబల్ ర్యాంకింగ్స్ లో యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ ఫర్డ్ నెంబర్ వన్ స్థానంలో ఉండగా... స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ, మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. బోధన, పరిశోధన నాణ్యత, పరిశోధనకు అనువైన వాతావరణ కల్పన, ప్రపంచవ్యాప్త గుర్తింపు, పరిశ్రమ... టాప్ వర్సిటీల ఎంపికలో ఈ అంశాలను ప్రామాణికంగా తీసుకున్నారు.
World Rankings
Indian Institutions
Universities
Times Higher Education
India

More Telugu News