Vinayaka Chavithi: వినాయక నిమజ్జనం సందర్భంగా భక్తులకు మెట్రో రైల్ శుభవార్త

Metro Good news on Vinayaka Nimajjanam
  • గురువారం అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లను నడపనున్నట్లు వెల్లడి
  • రాత్రి ఒంటి గంటకు చివరి రైలు బయలుదేరి, రెండు గంటలకు చివరి స్టేషన్ చేరుకుంటుందని వెల్లడి
  • 29న ఉదయం 6 గంటలకు యథాతథంగా మెట్రో కార్యకలాపాలు

భాగ్యనగరంలో వినాయక నిమజ్జనం సందర్భంగా మెట్రో రైల్ శుభవార్త చెప్పింది. రేపు అంటే 28 గురువారం రోజు అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. భక్తుల సౌకర్యార్థం అర్ధరాత్రి ఒంటి గంట వరకు రైళ్లు నడుపుతామని మెట్రో రైల్ అధికారులు వెల్లడించారు. రాత్రి రెండు గంటలకు రైళ్లు చివరి స్టేషన్‌కు చేరుకుంటాయన్నారు.

ఖైరతాబాద్, లక్డీకాపూల్ మెట్రో స్టేషన్‌లలో అదనపు పోలీసులు, ప్రయివేట్ సెక్యూరిటీని మోహరించినట్లు తెలిపారు. డిమాండ్‌ను బట్టి కొన్ని మెట్రో స్టేషన్లలో అదనపు టికెట్ కౌంటర్లు, అదనంగా రైళ్లు నడపనున్నట్లు వివరించారు. మళ్లీ 29న ఉదయం 6 గంటలకు యథాతథంగా మెట్రో కార్యకలాపాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News