Team India: చివరి వన్డేలో టీమిండియాకు భారీ టార్గెట్ నిర్దేశించిన కంగారూలు

  • రాజ్ కోట్ లో టీమిండియా, ఆసీస్ మూడో వన్డే
  • టాస్ గెలిచి బ్యాటింగ్  ఎంచుకున్న ఆసీస్
  • నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 352 పరుగులు
  • రాణించిన మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, లబుషేన్, వార్నర్
  • బుమ్రాకు 3, కుల్దీప్ యాదవ్ కు 2 వికెట్లు
Aussies set Team India huge target

టీమిండియాతో రాజ్ కోట్ లో జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా భారీ స్కోరు నమోదు చేసింది. టాపార్డర్ రాణించడంతో ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 352 పరుగులు సాధించింది. 

మిచెల్ మార్ష్ 96, స్టీవ్ స్మిత్ 74, మార్నస్ లబుషేన్ 72, డేవిడ్ వార్నర్ 56 పరుగులు చేశారు. మ్యాక్స్ వెల్ (5), కామెరాన్ గ్రీన్ (9), అలెక్స్ కేరీ (11) విఫలమయ్యారు. టీమిండియా బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 3, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీశారు. సిరాజ్ 1, ప్రసిద్ధ్ కృష్ణ 1 వికెట్ దక్కించుకున్నారు.

ఈ మూడు వన్డేల సిరీస్ ను టీమిండియా ఇప్పటికే 2-0తో కైవసం చేసుకున్న నేపథ్యంలో, నేటి మ్యాచ్ కు ప్రాధాన్యత లేకుండా పోయింది. అయితే, ఆసీస్ పూర్తిస్థాయి పేస్ బౌలింగ్ వనరులతో ఈ మ్యాచ్ లో ఆడుతుండడంతో, టీమిండియా బ్యాటర్లు వారిని ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తి కలిగిస్తోంది. 

మిచెల్ స్టార్క్, జోష్ హేజెల్ వుడ్, కెప్టెన్ పాట్ కమిన్స్, కామెరాన్ గ్రీన్ లతో ఆసీస్ పేస్ విభాగం బలంగా ఉంది. 21 ఏళ్ల యువ లెగ్ స్పిన్నర్ తన్వీర్ సంఘాను ఆసీస్ ఈ మ్యాచ్ లో బరిలో దించుతోంది.

More Telugu News