KCR: బోగస్ పథకాలతో దళితులను మోసం చేసిన కేసీఆర్‌పై అట్రాసిటీ కేసు పెట్టాలి.. ప్రజాసంఘాల నేతలు

  • సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘కేసీఆర్ పాలనలో దగాపడ్డ తెలంగాణ దళితులు’ పుస్తకావిష్కరణ 
  • హాజరైన పలువురు మేధావులు
  • రాష్ట్రంలోని దళితులందరికీ దళితబంధు పథకం ఇచ్చేందుకు 130 ఏళ్లు పడుతుందన్న వక్తలు
  • దళితుడి సీఎం హామీ ఏమైందని ప్రశ్న
SCST Atrocity Case Should File Against KCR New Democracy Demands

బోగస్ పథకాలతో ప్రజలను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని న్యూడెమొక్రసీతోపాటు ప్రజా సంఘాల నేతలు, మేధావులు డిమాండ్ చేశారు. డాక్టర్ ఎం. యాదరిగాచార్యులు రాసిన ‘కేసీఆర్ పాలనలో దగాపడ్డ తెలంగాణ దళితులు’ పుస్తకావిష్కరణ నిన్న సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. 

జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ వినాయక్‌రెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, ప్రొఫెసర్ పద్మజా షా, సీపీఐ (ఎంఎల్ ) న్యూడెమొక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జేబీ చలపతిరావు తదితరులు హాజరై బుక్‌లెట్‌ను విడుదల చేశారు. ఈ సందర్బంగా జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. అందరికీ నాణ్యమైన విద్య దొరికినప్పుడే దళితుల అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. 

ఆకునూరి మురళి మాట్లాడుతూ.. బీజేపీ, ఆరెస్సెస్ కుల వ్యవస్థను ప్రోత్సహిస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో 54.09 లక్షల మంది దళితులు ఉంటే.. దళితబంధు పథకాన్ని మాత్రం ఇప్పటి వరకు 40 వేల మందికి మాత్రమే ఇచ్చారని దుయ్యబట్టారు. ఈ లెక్కన రాష్ట్రంలోని దళితులందరికీ పథకం అందించేందుకు 130 ఏళ్లు పడుతుందని వివరించారు. దళితులకు మూడెకరాల భూమి, దళితుడిని సీఎం చేస్తామన్న హామీ ఏమైందని కేసీఆర్‌ను ప్రశ్నించారు.

More Telugu News