ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం
- చైనాలోని హాంగ్ ఝౌ నగరంలో ఆసియా క్రీడలు
- ఇవాళ ఇప్పటివరకు భారత్ కు 4 పతకాలు
- ఈక్వెస్ట్రియన్ లో స్వర్ణం సాధించిన భారత బృందం
- సెయిలింగ్ లో భారత్ కు ఒక రజతం, రెండు కాంస్యాలు
ఇవాళ ఆసియా క్రీడల్లో భారత్ మరో 3 పతకాలు కూడా లభించాయి. ఈ మూడు పతకాలు సెయిలర్లు సాధించినవే. తొలుత మహిళల డింగీ ఐఎల్ సీఏ4 ఈవెంట్ లో నేహా ఠాకూర్ రజతం సాధించగా, పురుషుల విభాగంలో ఎబాద్ అలీ కాంస్యం సాధించి భారత శిబిరంలో ఆనందం నింపాడు. సెయిలింగ్ లో ఆర్ఎస్-x విండ్ సర్ఫింగ్ ఈవెంట్ లో ఎబాద్ అలీ మూడో స్థానంలో నిలిచాడు. ఎబాద్ అలీ ఈ ఈవెంట్ లో 52 పాయింట్ల నెట్ స్కోరు నమోదు చేశాడు.
ఇక పురుషుల డింగీ ఈవెంట్ లో విష్ణు శరవణన్ కాంస్యం నెగ్గాడు. ఐఎస్ సీఏ7 విభాగంలో విష్ణు శరవణన్ 34 పాయింట్ల నెట్ స్కోరు నమోదు చేశాడు. తాజా ఫలితాల అనంతరం, హాంగ్ ఝౌ ఆసియా క్రీడల్లో ఇప్పటివరకు భారత్ సాధించిన పతకాల సంఖ్య 14కి పెరిగింది.