nannapaneni rajakumari: చంద్రబాబు అరెస్ట్‌పై ప్రధాని నరేంద్రమోదీ స్పందించాలి: నన్నపనేని

PM Modi should talk about chandrababu arrest says nannapaneni
  • చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారన్న నన్నపనేని
  • చంద్రబాబు ఎగిసిపడే కెరటం కాదని, పడిలేచే కెరటమని వ్యాఖ్య
  • మూడుసార్లు సీఎంగా చేసిన వ్యక్తి పట్ల జగన్ కక్షపూరిత ధోరణి అని ఆగ్రహం
తమ పార్టీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని, ఈ అక్రమ అరెస్ట్‌పై ప్రధాని నరేంద్రమోదీ స్పందించాలని టీడీపీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి అన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరులో ధూళిపాళ్ల నరేంద్ర ఆధ్వర్యంలో టీడీపీ నిరసన దీక్ష చేపట్టింది. ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలిపిన నన్నపనేని మాట్లాడుతూ... చంద్రబాబు ఎగిసిపడే కెరటం కాదని, పడిలేచే కెరటమన్నారు.

చంద్రబాబుది 45 ఏళ్ల రాజకీయ జీవితమన్నారు. ఆయన మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేశారన్నారు. అలాంటి నాయకుడి పట్ల ముఖ్యమంత్రి జగన్ కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అక్రమ కేసుల్లో తమ పార్టీ అధినేతను అరెస్ట్ చేశారని వాపోయారు. ఎవరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినప్పటికీ చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్నారు.
nannapaneni rajakumari
Chandrababu
Narendra Modi
YS Jagan

More Telugu News